యెహెజ్కేలు 37:7-8
యెహెజ్కేలు 37:7-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను ప్రవచిస్తూ ఉండగా, గలగలమనే శబ్దం వినిపించి చూస్తే, ఆ ఎముకలన్నీ దగ్గరకు వచ్చి ఒక దానికి ఒకటి అంటుకున్నాయి. నేను చూస్తుండగా వాటి మీదికి కండరాలు మాంసం పొదగడం, వాటి మీద చర్మం కప్పుకోవడం కనిపించింది, అయితే వాటిలో ఊపిరి లేదు.
యెహెజ్కేలు 37:7-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
యెహెజ్కేలు 37:7-8 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్ల ముందే వాటిమీద నరాలు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.
యెహెజ్కేలు 37:7-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను.
యెహెజ్కేలు 37:7-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)