యెహెజ్కేలు 4:9
యెహెజ్కేలు 4:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి.
యెహెజ్కేలు 4:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కోసం గోధుమలూ, బార్లీ, చిక్కుడు గింజలూ, కాయ ధాన్యాలూ, జొన్నలూ, సజ్జలూ తెచ్చుకో. వాటన్నిటినీ ఒక పాత్రలో వేసి నువ్వు ఒక వైపున పడుకునే రోజుల లెక్క ప్రకారం రొట్టెలు చేసుకోవాలి. 390 రోజులు నువ్వు ఇలాగే చేసుకుని తినాలి!
యెహెజ్కేలు 4:9 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలో వేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు ప్రక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి.
యెహెజ్కేలు 4:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్లజిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనముచేయుచు రావలెను