యెహెజ్కేలు 8:3
యెహెజ్కేలు 8:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు.
యెహెజ్కేలు 8:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నావైపు చెయ్యి వంటిదాన్ని చాపాడు. నా తలపై జుట్టును ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నన్ను లేపి భూమికీ ఆకాశానికీ మధ్యకు ఎత్తాడు. అప్పుడు నాకు కలిగిన దేవుని దర్శనంలో ఆయన యెరూషలేముకు ఉత్తరాన ఉన్న ఆవరణ ద్వారం దగ్గర తీవ్రమైన రోషాన్ని కలిగించే విగ్రహం ఉన్న చోటికి నన్ను తెచ్చాడు.
యెహెజ్కేలు 8:3 పవిత్ర బైబిల్ (TERV)
పిమ్మట చెయ్యివంటిదొకటి నేను చూశాను. ఆ చెయ్యి నా మీదికి వచ్చి నా తలపై జుట్టుపట్టుకుంది. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. ఆ దేవదర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. ఆ ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది.
యెహెజ్కేలు 8:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశములమధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.