యెషయా 43:20-21
యెషయా 43:20-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.
యెషయా 43:20-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. ఎందుకంటే నేను ఏర్పరచుకొన్న ప్రజలు తాగటానికి అరణ్యంలో నీళ్ళు పుట్టిస్తున్నాను. ఎడారిలో నదులు పారజేస్తాను. నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు నా గొప్పతనాన్ని ప్రచురిస్తారు.
యెషయా 43:20-21 పవిత్ర బైబిల్ (TERV)
అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
యెషయా 43:20-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.
యెషయా 43:20-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)