యెషయా 52:14-15
యెషయా 52:14-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు. అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు.
యెషయా 52:14-15 పవిత్ర బైబిల్ (TERV)
కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని చూచి అదరిపోయారు. అతణ్ణి ఒక మనిషిగా వారు గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు. కానీ అంతకంటె ఎక్కువమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు – జరిగింది వారు చూశారు. ఈ ప్రజలు ఆ కథ వినలేదు గాని వారు గ్రహించారు.”
యెషయా 52:14-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ మును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరో ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులువారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.
యెషయా 52:14-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మనుష్యులందరి కంటే అతని ముఖం చాలా వికారమని అతని రూపం మనిషిలా లేదని అతన్ని చూసి అనేకమంది దిగ్భ్రాంతి చెందినట్లు, అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు, అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు. తాము వినని వాటిని వారు గ్రహిస్తారు.