యెషయా 55:10-11
యెషయా 55:10-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వర్షం మంచు ఆకాశం నుండి క్రిందికి వచ్చి ఎలా తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి అది చిగురించి ఫలించేలా చేస్తాయో, అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది: అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా నేను కోరుకున్న ప్రకారం చేసి నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.
యెషయా 55:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు. ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
యెషయా 55:10-11 పవిత్ర బైబిల్ (TERV)
“వర్షం, మంచు ఆకాశం నుండి కురుస్తాయి. అవి నేలను తాకి, నేలను తడిచేయకుండా తిరిగి ఆకాశానికి వెళ్లవు. అప్పుడు నేల మొక్కలను మొలిపించి, ఎదిగింప చేస్తుంది. ఈ మొక్కలు రైతుకోసం విత్తనాలు సిద్ధం చేస్తాయి. ప్రజలు ఆహారంగా రొట్టెలకోసం ఈ విత్తనాలు వినియోగిస్తారు. అదే విధంగా నా నోటినుండి నా మాటలు బయలు వెళ్తాయి. అవి సంగతులను సంభవింప చేసేంతవరకు తిరిగి రావు. నేను ఏ సంగతులు సంభవించాలని అనుకొంటానో వాటిని నా మాటలు సంభవింపచేస్తాయి. ఏమి చేయాలని నేను నా మాటలను పంపిస్తానో వాటిని నా మాటలు సాధిస్తాయి.
యెషయా 55:10-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.