యెషయా 56:6-7
యెషయా 56:6-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాకు కట్టుబడి ఉంటూ ఆయనకు సేవ చేస్తూ, యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”
యెషయా 56:6-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరిస్తూ నా నిబంధనను ఆధారం చేసుకుంటూ యెహోవాకు సేవకులై యెహోవా నామాన్ని ప్రేమిస్తూ ఆయన్ని ఆరాధించడానికి ఆయన పక్షం చేరే విదేశీయులను నా పరిశుద్ధ పర్వతానికి తీసుకు వస్తాను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి. నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది.
యెషయా 56:6-7 పవిత్ర బైబిల్ (TERV)
యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవావైపు చేరుతారు. యెహోవాను సేవించి, ఆయనను ప్రేమించగలిగేట్టు వారు ఇలా చేస్తారు. వారు యెహోవాకు సేవకులు అయ్యేందుకు యెహోవావైపు చేరుతారు. సబ్బాతును ప్రత్యేక ఆరాధన రోజుగా వారు పాటిస్తారు, నా ఒడంబడిక (ధర్మశాస్త్రాన్ని) సన్నిహితంగా పాటించటం కొనసాగిస్తారు. “ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్పించే అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది” అని యెహోవా చెబుతున్నాడు.
యెషయా 56:6-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధపర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.