యెషయా 58:13-14
యెషయా 58:13-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్రాంతి దినాన ప్రయాణం చేయకుండా, నా ప్రతిష్ఠిత దినాన్ని నీ సొంత ఆహ్లాదం కోసం వాడకుండా ఉన్నావనుకో. విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా భావిస్తూ యెహోవాకు చెందిన విషయాలను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నావనుకో. నీ సొంత వ్యాపారం వదిలేసి విశ్రాంతి దినాన్ని సొంత ఆహ్లాదం కోసం వాడకుండా నీ సొంత మాటలు మాట్లాడకుండా గౌరవిస్తున్నావనుకో. అప్పుడు నువ్వు యెహోవా పట్ల ఆనందిస్తావు. దేశంలో ఉన్నత స్థలాలమీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ పూర్వీకుడు, యాకోబు స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను. యెహోవా తెలియచేసిన విషయాలు ఇవే.
యెషయా 58:13-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.
యెషయా 58:13-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా నా సబ్బాతును పాటిస్తే, సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే, అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు, దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను, మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను.” యెహోవా తెలియజేసిన మాట ఇదే.
యెషయా 58:13-14 పవిత్ర బైబిల్ (TERV)
సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి. అప్పుడు నీవు యెహోవా, నాయందు దయచూపమని అడగవచ్చు. మరియు యెహోవా అంటాడు, భూమికి పైగా ఉన్నతమైన చోట్లకు నేను నిన్ను మోసికొనివెళ్తాను. నేను నీకు భోజనం పెడ్తాను. నీ తండ్రి యాకోబుకు కలిగిన వాటిని నేను నీకు ఇస్తాను. ఈ విషయాలు యెహోవా చెప్పాడు గనుక అవి జరుగుతాయి.