న్యాయాధిపతులు 5:31 - Compare All Versions

న్యాయాధిపతులు 5:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

న్యాయాధిపతులు 5:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి. ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.” ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

న్యాయాధిపతులు 5:31 TERV (పవిత్ర బైబిల్)

“యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక! కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!” ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.

న్యాయాధిపతులు 5:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.