యిర్మీయా 21:8-9
యిర్మీయా 21:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ ప్రజలతో ఇలా చెప్పు. “యెహోవా చెప్పేదేమిటంటే, జీవమార్గం, మరణ మార్గం, నేను మీ ఎదుట ఉంచుతున్నాను. ఈ పట్టణంలో ఉండబోయే వాళ్ళు కత్తితో, కరువుతో, అంటురోగంతో చస్తారు. పట్టణం బయటకు వెళ్లి మిమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయులకు లోబడేవాళ్ళు బతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది.
యిర్మీయా 21:8-9 పవిత్ర బైబిల్ (TERV)
“యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు.
యిర్మీయా 21:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ ప్రజలతో నీవిట్లనుము–యెహోవా సెలవిచ్చునదేమనగా–జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.
యిర్మీయా 21:8-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఇంకా, ప్రజలతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి, నేను మీ ముందు జీవమార్గాన్ని, మరణమార్గాన్ని పెడుతున్నాను. ఈ పట్టణంలో ఉండబోయే వారు ఖడ్గం వల్ల గాని కరువు వల్ల గాని తెగులు వల్ల గాని చస్తారు. అయితే ఎవరైనా పట్టణం బయటకు వెళ్లి మీమీద దాడి చేస్తున్న బబులోనీయులకు లొంగిపోతే, వారు బ్రతుకుతారు; వారు తమ ప్రాణాలతో తప్పించుకుంటారు.