యోహాను 16:7-8
యోహాను 16:7-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి మరియు తీర్పును గురించి లోకస్తులు తప్పులో ఉన్నారని రుజువుపరుస్తాడు.
యోహాను 16:7-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
యోహాను 16:7-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు.