యోబు 32:6-9
యోబు 32:6-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను– నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువుచేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని; అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
యోబు 32:6-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలా మాటలాడసాగాడు. నేను వయస్సులో చిన్నవాణ్ణి. మీరు బహు వృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు. వృద్ధాప్యం మాట్లాడాలి, అధిక సంఖ్యగల సంవత్సరాలు జ్ఞానం బోధించడానికి తగినవి, అని నేను అనుకున్నాను. అయినా మనుషుల్లో ఆత్మ ఒకటి ఉంది. సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేస్తుంది. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. పెద్ద వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసినవారు కారు.
యోబు 32:6-9 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు. అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను. ‘పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి. చాలా సంవత్సరాలు బ్రతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి ఇవ్వాలి’ అని నాలో నేను అనుకొన్నాను. కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని ‘ఊపిరి’ ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది. వృద్ధులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు. వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన అవగాహన గలవారు కారు.
యోబు 32:6-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు: నేను వయస్సులో చిన్నవాన్ని, మీరు పెద్దవారు; అందుకే నేను భయపడ్డాను, నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు. ముందుగా వయస్సు మాట్లాడాలి; గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను. అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది. కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.