యోబు 4:4-6
యోబు 4:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు. నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా?
యోబు 4:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
యోబు 4:4-6 పవిత్ర బైబిల్ (TERV)
తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి. బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు. కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు. కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు! నీవు దేవున్ని ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు. కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి. నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక.
యోబు 4:4-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు. అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు. నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?