యోబు 8:5-7
యోబు 8:5-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో. నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు. నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది.
యోబు 8:5-7 పవిత్ర బైబిల్ (TERV)
అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు. నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు. నీకు మొదట ఉన్నదానికంటె ఎక్కువగా వస్తుంది.
యోబు 8:5-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
యోబు 8:5-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే, నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు. నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది.