యెహోషువ 21:44 - Compare All Versions

యెహోషువ 21:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా వారి పూర్వికులతో ప్రమాణం చేసినట్లే వారికి అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చారు. వారి శత్రువులలో ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులకు ఎదురు నిలబడలేకపోయారు; యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు.

షేర్ చేయి
యెహోషువ 21 TSA

యెహోషువ 21:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు.

షేర్ చేయి
యెహోషువ 21 IRVTEL

యెహోషువ 21:44 TERV (పవిత్ర బైబిల్)

మరియు వారి దేశానికి అన్నివైపులా ఆ ప్రజలు శాంతి కలిగి ఉండేటట్లు యెహోవా చేసాడు. చాలా కాలం క్రిందట వారి పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసింది ఇదే. వారి శత్రువులు ఎవరూ వారిని ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రతి శత్రువును ఓడించేటట్టు యెహోవా చేసాడు.

షేర్ చేయి
యెహోషువ 21 TERV

యెహోషువ 21:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవావారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవావారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.

షేర్ చేయి
యెహోషువ 21 TELUBSI