మత్తయి 15:8-9
మత్తయి 15:8-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి; వారి బోధలు కేవలం మనుష్యుల నియమాలు, వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు.’ ”
మత్తయి 15:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”
మత్తయి 15:8-9 పవిత్ర బైబిల్ (TERV)
‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి. వాళ్ళ ఆరాధనలు వ్యర్థం! వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’”
మత్తయి 15:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వేషధారులారా – ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి