మత్తయి 6:19-21
మత్తయి 6:19-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“భూమి మీద మీ కొరకు ధనాన్ని కూడపెట్టుకోకండి. ఇక్కడ దానికి చెదలు పట్టి, తుప్పు పట్టి నాశనం అవుతుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అయితే మీ కొరకు పరలోకంలో ధనం కూడపెట్టుకోండి, అక్కడ చిమ్మెట గాని క్రిమికీటకాలుగాని నాశనం చేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.
మత్తయి 6:19-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
మత్తయి 6:19-21 పవిత్ర బైబిల్ (TERV)
“మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
మత్తయి 6:19-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.