మత్తయి 6:20-22 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 6:20-22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.

షేర్ చేయి
మత్తయి 6 TELUBSI

మత్తయి 6:20-22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది. “శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 6 IRVTEL

మత్తయి 6:20-22 TERV (పవిత్ర బైబిల్)

మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 6 TERV

మత్తయి 6:20-22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే మీ కోసం పరలోకంలో ధనం కూడపెట్టుకోండి. అక్కడ చెదలు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది. “కన్ను దేహానికి దీపం. మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే మీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 6 TSA