నెహెమ్యా 1:7-9
నెహెమ్యా 1:7-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు. “మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, మీరేమన్నారంటే, ‘మీరు నా పట్ల నమ్మకద్రోహులుగా ప్రవర్తిస్తే, దేశాల మధ్యలోకి మిమ్మల్ని చెదరగొడతాను, కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’
నెహెమ్యా 1:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు. నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా.
నెహెమ్యా 1:7-9 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నీవు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణీకరించాము. నీవు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేసుకొనుము. దేవా, నీవు అతనికి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను. అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించినట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.
నెహెమ్యా 1:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును. అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.