నెహెమ్యా 10:39
నెహెమ్యా 10:39 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు. “మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసుకుంటామని మేమంతా ప్రమాణం చేశాము!”
నెహెమ్యా 10:39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులు, లేవీయులు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె తెచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వార పాలకులు, గాయకులు వాటిని తీసుకు పవిత్ర పాత్రలను ఉంచే ఆలయం గదుల్లో ఉంచాలి. మా దేవుని మందిరం పనులను నిర్ల్యక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాం.
నెహెమ్యా 10:39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.
నెహెమ్యా 10:39 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి. “మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.”