కీర్తనలు 42:1-2
కీర్తనలు 42:1-2 పవిత్ర బైబిల్ (TERV)
దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది. సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది. ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
షేర్ చేయి
Read కీర్తనలు 42కీర్తనలు 42:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది. నా ప్రాణం దేవుని కోసం, సజీవుడైన దేవుని కోసం తీవ్రమైన దాహంతో ఉంది. దేవుని సమక్షంలోకి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సమక్షంలో నేను ఎప్పుడు కనిపిస్తాను?
షేర్ చేయి
Read కీర్తనలు 42కీర్తనలు 42:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
షేర్ చేయి
Read కీర్తనలు 42