కీర్తనలు 69:13-15
కీర్తనలు 69:13-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి. ఊబిలో నుండి నన్ను విడిపించండి, నన్ను మునిగి పోనివ్వకండి; నన్ను ద్వేషించేవారి నుండి లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి. వరదలు నన్ను ముంచనీయకండి, అగాధాలు నన్ను మ్రింగనివ్వకండి గుంటలో నన్ను పడనివ్వకండి.
కీర్తనలు 69:13-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి. ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు. వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు.
కీర్తనలు 69:13-15 పవిత్ర బైబిల్ (TERV)
నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. బురదలో నుండి నన్ను పైకి లాగుము. బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు. నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము. అలలు నన్ను ముంచివేయనీయకుము. లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము. సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
కీర్తనలు 69:13-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము. నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మ్రింగనియ్యకుము గుంట నన్ను మ్రింగనియ్యకుము.
కీర్తనలు 69:13-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)