కీర్తనలు 81:13-16
కీర్తనలు 81:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంతమేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదునువారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురువారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
కీర్తనలు 81:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది! అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను. యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక! అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.
కీర్తనలు 81:13-16 పవిత్ర బైబిల్ (TERV)
ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే, అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను. ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను. యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు, అందుచేత వారు శిక్షించబడతారు. దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”
కీర్తనలు 81:13-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“నా ప్రజలు నా మాట మాత్రమే వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే, అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని, వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని! యెహోవాను ద్వేషించేవారు ఆయన ఎదుట భయంతో దాక్కుంటారు, వారి శిక్ష శాశ్వతంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను; బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.”