రోమా 2:12-13 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 2:11-13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

షేర్ చేయి
రోమా 2 TELUBSI

రోమా 2:12-13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు.

షేర్ చేయి
రోమా 2 IRVTEL

రోమా 2:12-13 TERV (పవిత్ర బైబిల్)

ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసినవాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు. ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.

షేర్ చేయి
రోమా 2 TERV

రోమా 2:12-13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపం చేసేవారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పుపొందుతారు. ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు.

షేర్ చేయి
రోమా 2 TSA