1
1 తిమోతికి 6:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
Compare
Explore 1 తిమోతికి 6:12
2
1 తిమోతికి 6:10
ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
Explore 1 తిమోతికి 6:10
3
1 తిమోతికి 6:6
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
Explore 1 తిమోతికి 6:6
4
1 తిమోతికి 6:7-8
మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
Explore 1 తిమోతికి 6:7-8
5
1 తిమోతికి 6:17
ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
Explore 1 తిమోతికి 6:17
6
1 తిమోతికి 6:9
ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
Explore 1 తిమోతికి 6:9
7
1 తిమోతికి 6:18-19-18-19
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
Explore 1 తిమోతికి 6:18-19-18-19
Home
Bible
Plans
Videos