1
రోమీయులకు వ్రాసిన లేఖ 5:8
పవిత్ర బైబిల్
కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.
Compare
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:8
2
రోమీయులకు వ్రాసిన లేఖ 5:5
దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:5
3
రోమీయులకు వ్రాసిన లేఖ 5:3-4
అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:3-4
4
రోమీయులకు వ్రాసిన లేఖ 5:1-2
మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:1-2
5
రోమీయులకు వ్రాసిన లేఖ 5:6
నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:6
6
రోమీయులకు వ్రాసిన లేఖ 5:9
దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:9
7
రోమీయులకు వ్రాసిన లేఖ 5:19
ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:19
8
రోమీయులకు వ్రాసిన లేఖ 5:11
పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 5:11
Home
Bible
Plans
Videos