1
ప్రసంగి 5:2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి, నీ హృదయం తొందరపడకుండ నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నారు నీవు భూమిపై ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.
Compare
Explore ప్రసంగి 5:2
2
ప్రసంగి 5:19
అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము.
Explore ప్రసంగి 5:19
3
ప్రసంగి 5:10
డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు; సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఇది కూడా అర్థరహితము.
Explore ప్రసంగి 5:10
4
ప్రసంగి 5:1
నీవు దేవుని ఆలయానికి వెళ్లినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము దుర్మార్గపు పనులు చేస్తున్నామని తెలుసుకోకుండా మూర్ఖుల్లా బలి అర్పించడం కన్నా దగ్గరకు వెళ్లి వినడం మంచిది.
Explore ప్రసంగి 5:1
5
ప్రసంగి 5:4
నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు.
Explore ప్రసంగి 5:4
6
ప్రసంగి 5:5
మ్రొక్కుబడి చేసి చెల్లించక పోవడం కంటే మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది.
Explore ప్రసంగి 5:5
7
ప్రసంగి 5:12
శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, సుఖంగా నిద్రపోతారు, కానీ ధనికులకున్న సమృద్ధి వారికి నిద్రపట్ట నివ్వదు.
Explore ప్రసంగి 5:12
8
ప్రసంగి 5:15
ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే దిగంబరిగానే వెళ్లిపోతారు. తాము కష్టపడిన దానిలో నుండి వారు తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.
Explore ప్రసంగి 5:15
Home
Bible
Plans
Videos