ఆదికాండము 49
49
1యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. –మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
2యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి
మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
3రూబేనూ, నీవు నా పెద్దకుమారుడవు
నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును
ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
4నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు
నీ తండ్రి మంచముమీది కెక్కితివి
దానిని అపవిత్రము చేసితివి
అతడు నా మంచముమీది కెక్కెను.
5షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి
ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
6నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు
నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు
వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి
తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి.
7వారికోపము వేండ్రమైనది
వారి ఉగ్రతయు కఠినమైనది
అవి శపింపబడును
యాకోబులో వారిని విభజించెదను
ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
8యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు
నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును
నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
9యూదా కొదమసింహము
నా కుమారుడా, నీవు పెట్టినదానితిని వచ్చితివి
సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను
అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను
అతని లేపువాడెవడు?
10షిలోహు వచ్చువరకు#49:10 లేక, అతడు షిలోహుకు వచ్చువరకు.
యూదా యొద్దనుండి దండము తొలగదు
అతని కాళ్లమధ్యనుండి రాజదండము తొలగదు
ప్రజలు అతనికి విధేయులైయుందురు.
11ద్రాక్షావల్లికి తన గాడిదను
ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి
ద్రాక్షారసములో తన బట్టలను
ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
12అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను
అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
13జెబూలూను సముద్రపు రేవున నివసించును
అతడు ఓడలకు రేవుగా ఉండును
అతని పొలిమేర సీదోనువరకు నుండును.
14ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను
పండుకొనియున్న బలమైన గార్దభము.
15అతడు విశ్రాంతి మంచిదగుటయు
ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక
అతడు మోయుటకు భుజము వంచుకొని
వెట్టిచేయు దాసుడగును.
16దాను ఇశ్రాయేలు గోత్రికులవలె
తన ప్రజలకు న్యాయము తీర్చును.
17దాను త్రోవలో సర్పముగాను
దారిలో కట్లపాముగాను ఉండును.
అది గుఱ్ఱపు మడిమెలు కరచును
అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
18యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.
19బంటుల గుంపు గాదును కొట్టును
అతడు మడిమెను కొట్టును.
20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు
రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
21నఫ్తాలి విడువబడిన లేడి
అతడు ఇంపైనమాటలు పలుకును.
22యోసేపు ఫలించెడి కొమ్మ
ఊట యొద్ద ఫలించెడి కొమ్మ
దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
23విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి.
24యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్త బలమువలన
అతని విల్లు బలమైనదగును.
ఇశ్రాయేలునకు బండయు
మేపెడివాడును ఆయనే.
నీకు సహాయముచేయు నీ తండ్రి దేవునివలనను
పైనుండి మింటి దీవెనలతోను
25క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను
స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను
నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను
అతని బాహుబలము దిట్టపరచబడును
26నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని
చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును.
అవి యోసేపు తలమీదను
తన సహోదరులనుండి వేరుపరచబడిన
వాని నడినెత్తిమీదను ఉండును.
27బెన్యామీను చీల్చునట్టి తోడేలు
అతడు ఉదయమందు ఎరనుతిని
అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
28ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. 29తరువాత అతడు వారికాజ్ఞాపించుచు ఇట్లనెను–నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను. 30హిత్తీయుడైన ఎఫ్రోను భూమియం దున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. 31అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతిపెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. 32ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారులయొద్ద కొనబడినదనెను. 33యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.
Currently Selected:
ఆదికాండము 49: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.