YouVersion Logo
Search Icon

కీర్తనలు 127

127
యాత్రకీర్తన. సొలొమోనుది.
1యెహోవా ఇల్లు కట్టించనియెడల
దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
యెహోవా పట్టణమును కాపాడనియెడల
దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
2మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు
కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట
వ్యర్థమే.
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి
కిచ్చుచున్నాడు.
3కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము
గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
4యౌవనకాలమందు పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
5వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు
అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో
వాదించుదురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in