YouVersion Logo
Search Icon

కీర్తనలు 126

126
యాత్రకీర్తన.
1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో
నుండి రప్పించినప్పుడు
2మనము కలకనినవారివలె నుంటిమి
మన నోటి నిండ నవ్వుండెను
మన నాలుక ఆనందగానముతో నిండియుండెను.
అప్పుడు–యెహోవా వీరికొరకు గొప్పకార్యములు
చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.
3యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి
యున్నాడు
మనము సంతోషభరితులమైతిమి.
4దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా
యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.
5కన్నీళ్లు విడుచుచు విత్తువారు
సంతోషగానముతో పంట కోసెదరు.
6పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు
విత్తువాడు
సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in