YouVersion Logo
Search Icon

కీర్తనలు 150

150
1యెహోవాను స్తుతించుడి.
ఆయన పరిశుద్ధాలయమునందు
దేవుని స్తుతించుడి.
ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు
ఆయనను స్తుతించుడి.
2ఆయన పరాక్రమ కార్యములనుబట్టి
ఆయనను స్తుతించుడి.
ఆయన మహా ప్రభావమునుబట్టి
ఆయనను స్తుతించుడి.
3బూరధ్వనితో
ఆయనను స్తుతించుడి.
స్వరమండలముతోను సితారాతోను
ఆయనను స్తుతించుడి.
4తంబురతోను నాట్యముతోను
ఆయనను స్తుతించుడి.
తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను
ఆయనను స్తుతించుడి.
5మ్రోగు తాళములతో
ఆయనను స్తుతించుడి.
గంభీరధ్వనిగల తాళములతో
ఆయనను స్తుతించుడి.
6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక
యెహోవాను స్తుతించుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in