YouVersion Logo
Search Icon

కీర్తనలు 60

60
ప్రధానగాయకునికి. షూషనేదూతుమీద పాడదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను అరమోజబాయీయులతోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పుపల్లములో పండ్రెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది. అనుపదగీతము.
1దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదర
గొట్టి యున్నావు
నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
2నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని
బద్దలు చేసియున్నావు
అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు
చేయుము.
3నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి
తూలునట్లుచేయు మద్యమును మాకు త్రాగించితివి
4సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై
నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము
నిచ్చియున్నావు. (సెలా.)
5నీ ప్రియులు విమోచింపబడునట్లు
నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము
6తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి
యున్నాడు
నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను
సుక్కోతు లోయను కొలిపించెదను.
7గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు
శిరస్త్రాణము
యూదా నా రాజదండము.
8మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము
ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును
ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.
9కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొనిపోవును?
ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
10దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా?
దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని
యున్నావు గదా?
11మనుష్యుల సహాయము వ్యర్థము
శత్రువులను జయించుటకు మాకు సహాయము దయ
చేయుము.
12దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము
మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in