YouVersion Logo
Search Icon

కీర్తనలు 61

61
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.
1దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము
నా ప్రార్థనకు చెవియొగ్గుము
2నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు
మొఱ్ఱపెట్టుచున్నాను
నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కిం
చుము.
3నీవు నాకు ఆశ్రయముగా నుంటిని.
శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
4యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను
నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)
5దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి
యున్నావు
నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము
నీవు నాకనుగ్రహించియున్నావు.
6రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక
అతని సంవత్సరములు తరతరములుగడచును గాక.
7దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక
అతని కాపాడుటకై కృపాసత్యములను నియమిం
చుము.
8దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు
నట్లు
నీ నామమును నిత్యము కీర్తించెదను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in