YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 56

56
సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.
1దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
2నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
3నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
4నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
5నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
6వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
7దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
8నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.
9కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.
10దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
మనుష్యులు నన్ను బాధించలేరు.
12దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in