కీర్తనల గ్రంథము 55
55
సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.
1దేవా, నా ప్రార్థన వినుము.
దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4నాలో నా గుండె అదురుతోంది.
నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
5నాకు భయము మరియు వణకుగా ఉంది.
నేను భయపడిపోయాను.
6ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8నేను పరుగెత్తి పోదును.
నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
నేను దాక్కోగలను.
13కాని, అది చేస్తున్నది నీవే.
నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
16నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
ఆయన నా మాట వింటాడు.
18నేను చాలా యుద్ధాలు చేశాను.
కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.
నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.
22నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.
Currently Selected:
కీర్తనల గ్రంథము 55: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International