YouVersion Logo
Search Icon

ప్రకటన 4

4
పరలోకంలో జరిగే ఆరాధన
1ఆ తరువాత, నేను చూస్తూ ఉండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి కనిపించింది. నేను మొదట విన్న బూరధ్వని వంటి స్వరం నాతో, “ఇక్కడికి ఎక్కి రా, తరువాత జరగాల్సి ఉందో నేను నీకు చూపిస్తాను” అని చెప్పింది. 2వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూసాను. 3అక్కడ సింహాసనం మీద కూర్చున్న వాడు చూడడానికి సూర్యకాంత మణిలా కెంపులా మెరుస్తూ కనబడ్డాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తున్న వానవిల్లు ఆవరించి ఉండింది. 4ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చునివున్నారు వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగివున్నారు. 5ఆ సింహాసనం నుండి మెరుపులు, ఉరుముల గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.#4:5 ఆత్మలు అంటే, ఏడంతల ఆత్మ 6ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది.
మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు ముందు వెనుక కళ్ళతో నిండి ఉన్నాయి. 7మొదటి ప్రాణి సింహంలా, రెండవ ప్రాణి దూడలా, మూడవ ప్రాణి ముఖం మనిషిలా, నాలుగవ ప్రాణి ఎగురుతున్న పక్షిరాజులా ఉన్నాయి. 8ఈ నాలుగు ప్రాణులలో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం:
“ఉండినవాడు, ఉన్న వాడు,
రానున్నవాడైన ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు,#4:8 యెషయా 6:3
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు’ ”
అని అంటున్నాయి. 9ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా, 10ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు:
11“ఓ ప్రభువా, మా దేవా!
నీవు సమస్తాన్ని సృష్టించావు,
నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి,
కనుక మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి
నీవే యోగ్యుడవు.”

Currently Selected:

ప్రకటన 4: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ప్రకటన 4