YouVersion Logo
Search Icon

కీర్తనలు 120

120
కీర్తన 120
యాత్రకీర్తన.
1నా బాధలో యెహోవాకు మొరపెడతాను,
ఆయన నాకు జవాబిస్తారు.
2యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి
మోసకరమైన నాలుక నుండి
నన్ను రక్షించండి.
3ఓ మోసకరమైన నాలుకా,
దేవుడు నీకేం చేస్తారు?
ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?
4వీరుల పదునైన బాణాలతో,
మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.
5నేను మెషెకులో నివసించినందుకు,
కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!
6సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో
చాలా కాలం నివసించాను.
7నేను సమాధానం కోరుతున్నాను;
కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in