1
అపొస్తలుల కార్యములు 7:59-60
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
సరిపోల్చండి
Explore అపొస్తలుల కార్యములు 7:59-60
2
అపొస్తలుల కార్యములు 7:47-50
అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
Explore అపొస్తలుల కార్యములు 7:47-50
3
అపొస్తలుల కార్యములు 7:57-58
అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.
Explore అపొస్తలుల కార్యములు 7:57-58
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు