1
మత్తయి 5:15-16
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
సరిపోల్చండి
Explore మత్తయి 5:15-16
2
మత్తయి 5:14
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.
Explore మత్తయి 5:14
3
మత్తయి 5:8
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
Explore మత్తయి 5:8
4
మత్తయి 5:6
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
Explore మత్తయి 5:6
5
మత్తయి 5:44
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
Explore మత్తయి 5:44
6
మత్తయి 5:3
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
Explore మత్తయి 5:3
7
మత్తయి 5:9
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు.
Explore మత్తయి 5:9
8
మత్తయి 5:4
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
Explore మత్తయి 5:4
9
మత్తయి 5:10
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
Explore మత్తయి 5:10
10
మత్తయి 5:7
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
Explore మత్తయి 5:7
11
మత్తయి 5:11-12
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
Explore మత్తయి 5:11-12
12
మత్తయి 5:5
సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు.
Explore మత్తయి 5:5
13
మత్తయి 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
Explore మత్తయి 5:13
14
మత్తయి 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
Explore మత్తయి 5:48
15
మత్తయి 5:37
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. పె
Explore మత్తయి 5:37
16
మత్తయి 5:38-39
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము.
Explore మత్తయి 5:38-39
17
మత్తయి 5:29-30
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
Explore మత్తయి 5:29-30
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు