1
యెహె 37:4-5
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను.
సరిపోల్చండి
యెహె 37:4-5 ని అన్వేషించండి
2
యెహె 37:6
మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
యెహె 37:6 ని అన్వేషించండి
3
యెహె 37:3
ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
యెహె 37:3 ని అన్వేషించండి
4
యెహె 37:1-2
యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి.
యెహె 37:1-2 ని అన్వేషించండి
5
యెహె 37:7-8
ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
యెహె 37:7-8 ని అన్వేషించండి
మీ అనుభవాన్ని వ్యక్తిగతీకృతం చేయడానికి YouVersion కుకీలను ఉపయోగిస్తుంది. మా వెబ్సైట్ ని ఉపయోగించడం ద్వారా, మీరు మా గోప్యతా విధానంలో వివరించబడిన మా కుకీల వాడకాన్ని అంగీకరిస్తారు.
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు