1
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:4-5
పవిత్ర బైబిల్
ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు. దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు.
సరిపోల్చండి
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:4-5
2
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:7
ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:7
3
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:6
ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:6
4
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:13
అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:13
5
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:8
దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నశించి పోదు.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:8
6
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:1
ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:1
7
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:2
నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:2
8
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:3
నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:3
9
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:11
నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు