1
2 రాజులు 4:2
పవిత్ర బైబిల్
“నేను నీకెలా సహాయం చేయగలను? మీ ఇంట్లో ఏమున్నదో చెప్పుము” అని ఎలీషా అడిగినాడు. ఆమె, “మా ఇంట్లో ఏమీ లేదు. ఒలీవ నూనెగల ఒక జాడీ వున్నది” అని బదులు చెప్పింది.
సరిపోల్చండి
Explore 2 రాజులు 4:2
2
2 రాజులు 4:1
ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, “నాభర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త మరణించాడు. అతను యెహోవాని గౌరవించెనని నీకు తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. ఇప్పుడా వ్యక్తి నా ఇద్దరు కొడుకులను తీసుకు వెళ్లి వారిని తన బానిసులుగా చేసుకోవలెనని అనుకున్నాడు” అని విన్నవించింది.
Explore 2 రాజులు 4:1
3
2 రాజులు 4:3
అప్పుడు ఎలీషా, “వెళ్లి మీ ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి పాత్రలు అడిగి తీసుకొనిరా. అవి ఖాళీగా ఉండాలి. చాలా పాత్రలు అడిగి తీసుకో.
Explore 2 రాజులు 4:3
4
2 రాజులు 4:4
తర్వాత మీ ఇంటికి పోయి తలుపులు మూసుకో. నీవు నీ కుమారులు మాత్రం ఇంటిలో వుండాలి. అటు తర్వాత నూనెను ఆ పాత్రలో పోయుము. వాటిని వేరే ఒక చోట ఉంచుము” అని చెప్పాడు.
Explore 2 రాజులు 4:4
5
2 రాజులు 4:6
ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో చెప్పింది. కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ పూర్తి అయింది.
Explore 2 రాజులు 4:6
6
2 రాజులు 4:7
ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమారులు మిగిలిన పైకంతో జీవించగలుగుతారు.”
Explore 2 రాజులు 4:7
7
2 రాజులు 4:5
అందువల్ల ఆ స్త్రీ ఎలీషాని విడిచి తన ఇంటిలోకి వెళ్లి తలుపులు మూసుకొనినది. ఆమెయు తన కొడుకులు మాత్రమే ఇంట్లో వున్నారు. ఆమె కుమారులు పాత్రలు తెచ్చారు. ఆమె వాటిలో నూనె పోసింది.
Explore 2 రాజులు 4:5
8
2 రాజులు 4:34
ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.
Explore 2 రాజులు 4:34
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు