1
1 కొరింథీ 12:7
తెలుగు సమకాలీన అనువాదము
అందరి మంచి కొరకు ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ 12:7
2
1 కొరింథీ 12:27
కావున మీరందరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే.
Explore 1 కొరింథీ 12:27
3
1 కొరింథీ 12:26
ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.
Explore 1 కొరింథీ 12:26
4
1 కొరింథీ 12:8-10
ఒకరికి ఆత్మ ద్వారా జ్ఞాన సందేశం ఇవ్వబడింది, అదే ఆత్మ ద్వారా మరొకరికి విజ్ఞత సందేశం ఇవ్వబడింది. అదే ఆత్మ ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు. ఆత్మ ఒకరికి అద్బుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు.
Explore 1 కొరింథీ 12:8-10
5
1 కొరింథీ 12:11
ఇవన్ని ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరికి వాటిని పంచి ఇస్తున్నాడు.
Explore 1 కొరింథీ 12:11
6
1 కొరింథీ 12:25
అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగివుండడానికి ఆయన అలా చేశారు.
Explore 1 కొరింథీ 12:25
7
1 కొరింథీ 12:4-6
అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని పంచిపెట్టే ఆత్మ ఒక్కడే. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.
Explore 1 కొరింథీ 12:4-6
8
1 కొరింథీ 12:28
మరియు దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తరువాత అద్బుతాలు చేసేవారిని, ఆ తరువాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు.
Explore 1 కొరింథీ 12:28
9
1 కొరింథీ 12:14
శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలతో రూపొందించబడింది.
Explore 1 కొరింథీ 12:14
10
1 కొరింథీ 12:22
అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి
Explore 1 కొరింథీ 12:22
11
1 కొరింథీ 12:17-19
శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు? అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదానిని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచాడు. అవన్ని ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ?
Explore 1 కొరింథీ 12:17-19
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు