1
1 కొరింథీ 13:4-5
తెలుగు సమకాలీన అనువాదము
ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్ధం లేనిది, త్వరగా కోపపడదు, ప్రేమ తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ 13:4-5
2
1 కొరింథీ 13:7
అది ఎల్లప్పుడు కాపాడుతుంది, ఎల్లప్పుడు నమ్ముతుంది, ఎల్లప్పుడు నిరీక్షిస్తుంది, ఎల్లప్పుడు సహిస్తుంది.
Explore 1 కొరింథీ 13:7
3
1 కొరింథీ 13:6
ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో అది ఆనందిస్తుంది.
Explore 1 కొరింథీ 13:6
4
1 కొరింథీ 13:13
విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచివుంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే.
Explore 1 కొరింథీ 13:13
5
1 కొరింథీ 13:8
ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది.
Explore 1 కొరింథీ 13:8
6
1 కొరింథీ 13:1
మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడగలిగినా, నాకు ప్రేమ లేకపోతే, నేను కేవలం మ్రోగే గంట లేక గణగణలాడే కంచుతాళంలా ఉంటాను.
Explore 1 కొరింథీ 13:1
7
1 కొరింథీ 13:2
నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగివున్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగివున్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.
Explore 1 కొరింథీ 13:2
8
1 కొరింథీ 13:3
నాకున్న సంపాదన అంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కొరకు నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు.
Explore 1 కొరింథీ 13:3
9
1 కొరింథీ 13:11
నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాడిని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేసాను.
Explore 1 కొరింథీ 13:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు