“మనుష్యకుమారుడా, మాగోగు దేశానికి చెందిన గోగు వైపు అనగా మెషెకుకు తుబాలుకు రోషుకు అధిపతియైన వానివైపు నీ ముఖాన్ని త్రిప్పి, అతనికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పుమని ఆజ్ఞాపించింది: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.