1
యెహెజ్కేలు 7:19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు.
సరిపోల్చండి
యెహెజ్కేలు 7:19 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 7:27
రాజు దుఃఖిస్తారు, యువరాజు నిరాశకు గురవుతాడు, దేశ ప్రజల చేతులు వణకుతాయి. వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను, వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను. “ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
యెహెజ్కేలు 7:27 ని అన్వేషించండి
3
యెహెజ్కేలు 7:4
నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’
యెహెజ్కేలు 7:4 ని అన్వేషించండి
4
యెహెజ్కేలు 7:9
మీమీద ఏమాత్రం దయ చూపించను; మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’
యెహెజ్కేలు 7:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు