ప్రజలు పడకపై పడుకుని,
గాఢనిద్రలో ఉన్నప్పుడు,
రాత్రి వచ్చే కలలో,
నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని
వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి,
గోతిలో పడకుండ వారిని కాపాడడానికి,
ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని
ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు
హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.