1
సంఖ్యా 21:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా మోషేతో, “ఒక సర్పం చేసి స్తంభం మీద పెట్టు; పాము కాటేసినప్పుడు ఎవరైనా దానిని చూస్తే, వారు బ్రతుకుతారు” అని చెప్పారు.
సరిపోల్చండి
సంఖ్యా 21:8 ని అన్వేషించండి
2
సంఖ్యా 21:9
కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి, దాన్ని ఒక స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ఎవరైనా పాము కాటేసినప్పుడు, ఇత్తడి సర్పాన్ని చూస్తే, వారు చావలేదు.
సంఖ్యా 21:9 ని అన్వేషించండి
3
సంఖ్యా 21:5
దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ, “ఈ అరణ్యంలో మేము చావాలని ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఇక్కడ తినడానికి తిండి లేదు! త్రాగడానికి నీళ్లు లేవు! ఈ పిచ్చి ఆహారమంటే మాకు అసహ్యం!” అని అన్నారు.
సంఖ్యా 21:5 ని అన్వేషించండి
4
సంఖ్యా 21:6
అప్పుడు యెహోవా వారి మధ్యకు విషసర్పాలను పంపారు; అవి ప్రజలను కాటు వేశాయి, చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.
సంఖ్యా 21:6 ని అన్వేషించండి
5
సంఖ్యా 21:7
ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు.
సంఖ్యా 21:7 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు