1
అపొస్తలుల కార్యములు 2:38
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు.
సరిపోల్చండి
Explore అపొస్తలుల కార్యములు 2:38
2
అపొస్తలుల కార్యములు 2:42
వారు అపొస్తలులు చెప్పే బోధలకు లోబడి, వారి సహవాసంలో ఉండి, రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఆసక్తితో కొనసాగుతున్నారు.
Explore అపొస్తలుల కార్యములు 2:42
3
అపొస్తలుల కార్యములు 2:4
వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.
Explore అపొస్తలుల కార్యములు 2:4
4
అపొస్తలుల కార్యములు 2:2-4
అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది. అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.
Explore అపొస్తలుల కార్యములు 2:2-4
5
అపొస్తలుల కార్యములు 2:46-47
వారందరు ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇళ్ళలో అందరు కలిసి ఆనందంగా యథార్థ హృదయంతో రొట్టెను విరిచి తినేవారు. వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతిదినం రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.
Explore అపొస్తలుల కార్యములు 2:46-47
6
అపొస్తలుల కార్యములు 2:17
“ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.
Explore అపొస్తలుల కార్యములు 2:17
7
అపొస్తలుల కార్యములు 2:44-45
విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు.
Explore అపొస్తలుల కార్యములు 2:44-45
8
అపొస్తలుల కార్యములు 2:21
అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’
Explore అపొస్తలుల కార్యములు 2:21
9
అపొస్తలుల కార్యములు 2:20
మహా మహిమగల ప్రభువు దినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.
Explore అపొస్తలుల కార్యములు 2:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు