యెషయా 1

1
1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము.
2యెహోవా మాటలాడుచున్నాడు
ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము.
–నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితినివారు నామీద తిరుగబడియున్నారు.
3ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని
దొడ్డి తెలిసికొనును
ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
4పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా,
దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ.వారు యెహోవాను విసర్జించియున్నారు
ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు
ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.
5నిత్యము తిరుగుబాటు చేయుచు
మీరేల ఇంకను కొట్టబడుదురు?
ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు
ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
6అరకాలు మొదలుకొని తలవరకు
స్వస్థత కొంచెమైనను లేదు
ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు
అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన
చేయబడలేదు.
7మీ దేశము పాడైపోయెను
మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను
మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు
అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.
8ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని
పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను
సీయోను కుమార్తె విడువబడియున్నది.
9సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి
శేషము మనకు నిలుపని యెడల
మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమాన
ముగా ఉందుము.
10సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల
కించుడి.
గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు
చెవి యొగ్గుడి.
11యెహోవా సెలవిచ్చిన మాట ఇదే
–విస్తారమైన మీ బలులు నాకేల?
దహనబలులగు పొట్టేళ్లును
బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస
మాయెను
కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక
పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.
12నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే
నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న
వాడెవడు?
13మీ నైవేద్యము వ్యర్థము
అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము
దాని నికను తేకుడి
అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక
టనమును జరుగుచున్నవి
పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ
జాలను.
14మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము
లును నాకు హేయములు
అవి నాకు బాధకరములు
వాటిని సహింపలేక విసికియున్నాను.
15మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక
నా కన్నులు కప్పుకొందును
మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను
మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
16మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి.
మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల
గింపుడి.
17కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి
న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు
వానిని విడిపించుడి
తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష
ముగా వాదించుడి.
18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు
–రండి మన వివాదము తీర్చుకొందము
మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము
వలె తెల్లబడును
కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని
వగును.
19మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి
యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.
20సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు
ఖడ్గము పాలగుదురు
యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
21అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే!
అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో
నివసించెను
ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.
22నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి
చెడిపోయెను.
23నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు
వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు
కనిపెట్టుదురు
తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ
రాండ్ర వ్యాజ్యెము విచారించరు.
24కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును
సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున
అనుకొనుచున్నాడు–
ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను
నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.
25నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును
నిర్మలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసి వేసెదను.
26మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల
ఇచ్చెదను
ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ
మించెదను
అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు
నీకు పేరు పెట్టబడును.
27సీయోనుకు న్యాయముచేతను
తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము
కలుగును.
28అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా
నాశనమగుదురు
యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
29మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు
సిగ్గుపడుదురు
మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ
ములు ఎఱ్ఱబారును
30మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను
నీరులేని తోటవలెను అగుదురు.
31బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని
కణమువలెనుండును
ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా
కాలిపోవును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 1: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి